Suriya: అమ్మ అప్పు తీర్చడానికే హీరోనయ్యా
Suriya: తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు సూర్య. గజినీ సినిమాతో సూర్యను తెలుగు ప్రజలు మరింత ఆరాధించడం మొదలుపెట్టారు. గజిని తర్వాత టాలీవుడ్‌లో సూర్యకు మంచి మార్కెట్ ఏర్పడింది. దాంతో సూర్య నటించే ప్రతి సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతోంది. ఆయన నటించిన ప్రతిష్ఠాత్మక కంగువ సినిమా త్వరలో రిలీజ్ అవబోతోంది. ఈ సందర్భంగా సూర్య ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తన తండ్రి శివకుమార్ మంచి నటుడైనప్పటికీ సూర్య మాత్రం అసలు సినిమాల్లోకి రాకూడదు అనుకున్నాడట. సూర్యకు ఓ కంపెనీ పెట్టాలని .. అందులో తన తండ్రి పెట్టుబడి పెడితే ఇంకా బాగుంటుందని కలలు కనేవాడు. కానీ తన తల్లి కోసం హీరో అవ్వాల్సి వచ్చిందని సూర్య తెలిపాడు.
“” అసలు నాకు చిత్ర పరిశ్రమకు రావడమే ఇష్టం లేదు. మా నాన్న సినిమాల్లో నటిస్తున్న సమయంలో నేను ఓ వస్త్ర పరిశ్రమలో పనిచేసేవాడిని. అప్పట్లో నా జీతం నెలకు రూ.300. ఎప్పటికైనా ఓ కంపెనీ పెట్టకపోతానా అందులో మా నాన్న రూ.కోటి వరకు పెట్టుబడి పెట్టకపోతారా అని కలలు కనేవాడిని. ఓరోజు మా అమ్మ లక్ష్మి నాకు షాకింగ్ విషయం చెప్పింది. నాన్నకు తెలీకుండా రూ.25000 అప్పు చేసిందట. అది విని నేను షాకయ్యా. అప్పట్లో మా బ్యాంక్ బ్యాలెన్స్ రూ.1 లక్షకు మించి దాటేది కాదు. కొంతకాలం పాటు నాన్న పది నెలల పాటు పనికి వెళ్లలేని పరిస్థితి. నాన్న ఆల్రెడీ పలు సినిమాల్లో నటించి ఉన్నారు కాబట్టి ఓసారి మణిరత్నం ఓ సినిమా కోసం నన్ను సంప్రదించారు. అదే 1997లో వచ్చిన నెరుక్కుర్ నేర్. ఈ సినిమాలో విజయ్ హీరో. నేను సెకండ్ హీరో. నేను చేయను నాకు ఇష్టం లేదు అని చెప్తే మణిరత్నం బలవంతంగా ఒప్పించారు. అలా నా సినీ ప్రయాణం మొదలై ఈరోజు సూర్యగా మీ మన్ననలు పొందుతున్నాను. మొత్తానికి మొదటి సినిమాతోనే అమ్మ అప్పు తీర్చేసానన్న సంతోషం ఇప్పటికీ ఉంది “” అని తెలిపారు.