Suresh Babu: దేవరతో రాని సమస్య ఈ సినిమాతో ఎందుకొస్తుంది?
Suresh Babu: సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన వెట్టయాన్ సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. అయితే.. తమిళంలో వెట్టయాన్ అంటే తమిళ ప్రేక్షకులకు అర్థమవుతుంది. కానీ తెలుగు, హిందీ, కన్నడలోనూ ఇదే టైటిల్‌పై విడుదల చేస్తే పెద్దగా హిట్ అవ్వదేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై సురేష్ బాబు స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా హిందీ, కన్నడ, తమిళంలోనూ సేమ్ టైటిల్‌తో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందని.. అలాంటప్పుడు వెట్టయాన్ సినిమాకు ఎందుకు సమస్య వస్తుందని అన్నారు. దేవర మాదిరిగానే వెట్టయాన్ సినిమాను కూడా అన్ని భాషల ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం తమకుందని వెల్లడించారు.