Upasana గురించి తప్పుడు కూతలు.. చితకబాదిన ఫ్యాన్స్
Hyderabad: రామ్‌చరణ్(ram charan) సతీమణి ఉపాసన(upasana) గురించి తప్పుడు కూతలు కూసినందుకు ఫ్యాన్స్ సునిషిత్‌ను(sunishith) చితకబాదారు. టాలీవుడ్ టాప్ హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్ల గురించి, వారి పర్సనల్ విషయాల గురించి ఇంటర్వ్యూలో తప్పుగా మాట్లాడే సునిషిత్‌కు మొత్తానికి చరణ్ ఫ్యాన్స్ సరిగ్గా బుద్దిచెప్పారు. ఇంకోసారి తప్పుగా మాట్లాడకుండా మీడియా ముందు ఉపాసనకు సారీ చెప్పించారు. ఇంతకీ సునిషిత్ ఏమన్నాడంటే.. ఓ ఇంటర్వ్యూకి వెళ్లి ఉపాసనను రామ్ చరణ్ పెళ్లి చేసుకోవడానికి ముందు తను ప్రేమించానని, లవ్‌లో పడేయాలని చరణే తనతో చెప్పాడని సునిశిత్ అన్నాడు. దాంతో అతడి మితిమీరిన కామెంట్స్‌కి ఫ్యాన్స్‌కి ఒళ్లుమండిపోయింది. ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయకుండా బుద్దిగా ఉంటాడో లేదో చూడాలి.