Ooru Peru Bhairavakona: గరుడ పురాణంతో వస్తున్న సందీప్​ కిషన్​!

Hyderabad: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) జయాపజయాలను పక్కనపెట్టి వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయినా ఆశించిన స్థాయిలో ఒక్క సినిమా ఆడటం లేదు. అందుకే కాస్త జాగ్రత్తగా కథలను ఎంచుకుంటున్న ఈ హీరో ఇప్పుడు ‘ఊరు పేరు భైరవకోన’(Ooru Peru Bhairavakona) అనే హారర్ థ్రిల్లర్ ఫిలింతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్, పాట ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. తాజాగా టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ సినిమా కథ గరుడ పురాణం గ్రంథం చుట్టూ తిరగనుంది. శ్రీకృష్ణ దేవరాయల కాలంనాటి గరుణ పురాణానికి ఇప్పటి గరుడ పురాణంలో నాలుగు పేజీలు తగ్గాయంటూ టీజర్​ మొదలయింది. ఆ గ్రంథంలో మిస్ అయ్యిన నాలుగు పేజీలే ఈ భైరవకోన అంటూ సందీప్ తెలియజేశాడు. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. అలాగే విజువల్ వండర్ గా కూడా ఉంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కించిన వి ఐ ఆనంద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. వర్ష బాలమ్మ (Varsha Bollamma), కావ్య థాపర్, వెన్నల కిషోర్, వైవా హర్ష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.