Baby: ఏడిపించేసారు భ‌య్యా..!

Hyderabad: ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య‌, విరాజ్ అశ్విన్ యాక్ట్ చేసిన బ్లాక్ బ‌స్ట‌ర్ బేబీ (baby) సినిమాను సుమంత్ (sumanth) చూసార‌ట‌. ఈ సినిమా చూస్తున్న‌ప్పుడు ఆల్మోస్ట్ ఏడుపు వ‌చ్చేసింద‌ని అంటున్నారు. సినిమా చాలా బాగుంద‌ని, బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయినందుకు టీంకు కంగ్రాట్స్ చెప్పారు. సాయి రాజేష్ (sai rajesh) డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు SKN ప్రొడ్యూస్ చేసారు. ప‌ది రోజుల్లోనే సినిమా రూ.60 కోట్లు రాబ‌ట్టింది. ఈ మ‌ధ్య‌కాలంలో ఓ చిన్న సినిమా ఈ రేంజ్‌లో హిట్ అందుకున్న‌ది లేదు.

ఓ ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమాకు యూత్ బాగా క‌నెక్ట్ అయ్యారు. ఆనంద్ దేవ‌ర‌కొండ (anand devarakonda) కెరీర్‌లోనే ఈ సినిమా ఫ‌స్ట్ హిట్ అయి చెప్పుకోవ‌చ్చు. ఇక వైష్ణ‌వి చైత‌న్య (vaishnavi chaitanya) హీరోయిన్‌గా ఈ సినిమాతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫ‌స్ట్ సినిమాతోనే హిట్ కొట్టేయ‌డంతో చాలా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ని తెలిపింది. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun) కూడా ఆమెను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తేసారు.