Sukumar: కార్తీక్​ పరిస్థితి చూసి చలించిపోయా!

Eluru: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej), మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ (Samyuktha Menon) జంటగా నటించిన చిత్రం ‘విరూపాక్ష’ (Virupaksha).  స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) శిష్యుడు కార్తిక్ వర్మ దండు (Karthik Dandu) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా ఏప్రిల్ 16న ఏలూరులో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సుకుమార్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘విరూపాక్ష’ డైరెక్టర్ కార్తిక్ వర్మ ఎలాంటి క్రిటికల్ మెడికల్ కండిషన్ నుంచి బయటపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడో చెప్పుకొచ్చారు సుకుమార్​.

ఘనంగా జరిగిన ప్రీరిలీజ్​ ఈవెంట్​లో సుకుమార్​ మాట్లాడుతూ.. ‘కార్తిక్‌ నా దగ్గరకు వచ్చినపుడు మెడికల్ ప్రాబ్లెమ్ ఉండేది, ఐదారేళ్లు బతుకుతాడని డాక్టర్లు చెప్పారు. వాళ్ల్ అమ్మతో సహా హైదరాబాద్ వచ్చేశాడు. అప్పుడు అతను చాలా క్రిటికల్ కండిషన్‌లో ఉన్నాడు. కానీ పోయేలోగా ఒక్క సినిమాకు అయినా దర్శకత్వం చేయాలనుకున్నాడు. అయితే క్రమంగా ఆ ప్రాబ్లెమ్ నుంచి బయటపడి సినిమా కంప్లీట్ చేశాడు. తను సినిమా కంప్లీట్ చేయడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తను ఎలాంటి స్థితిలో బతికేవాడో చూశాను కాబట్టి చాలా ఎమోషనల్‌గా ఉంది. ఎందుకంటే కార్తిక్ స్టెరాయిడ్స్ మీద బతికేవాడు. అవి తీసుకోకుంటే బాడీలో ప్లేట్స్‌లెట్స్ పెరగవు. ఇప్పుడు ఆ సమస్య నుంచి బయటపడ్డాడంటే వాళ్ల అమ్మ ఆశీస్సులే’ అన్నారు. సాయి ధరమ్​ తేజ్​ గురించి మాట్లాడుతూ ‘యాక్సిడెంట్ తర్వాత మొదటిసారి ‘విరూపాక్ష’ సెట్స్ వెళ్లి సాయిని చూసినపుడు వణికిపోయాను. కన్నీళ్లు ఆగని స్థితి. నటించడానికి అక్షరం అక్షరం కూడబులక్కుంటున్నాడు. అయినా పట్టుదలగా ఒక్కొక్కటి నేర్చుకుని నటించాడు. నిజానికి తనకు ఇది మనిషిగానే కాక నటుడిగా పునర్జన్మ. ఈ సిమాలో అద్భుతంగా నటించాడు. సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నాడు’ అన్నారు సుకుమార్.