Sukumar: పుష్ప 2 సెట్స్‌లో ఫోన్ నేల‌కేసికొట్టిన సుకుమార్

sukumar bangs his phone on floor during pushpa 2 shoot

Sukumar: ద‌ర్శ‌కుడు సుకుమార్ ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌తో పుష్ప 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఏదీ అనుకున్న‌ట్లు అవ్వ‌డంలేద‌ని విసిగిపోయిన సుకుమార్.. అంద‌రూ చూస్తుండ‌గానే త‌న ఫోన్‌ను నేల‌కేసి కొట్టార‌ట‌. సినిమాలో న‌టిస్తున్న వారి నుంచి విభిన్న‌మైన న‌ట‌న ఎక్స్‌పెక్ట్ చేస్తున్న సుకుమార్‌.. వారి నుంచి అలాంటిదేమీ లేక‌పోవ‌డంతో తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసారట‌.

సినిమాలో సిండికేట్ మెంబ‌ర్ల స‌మావేశంలో అనే స‌న్నివేశాన్ని షూట్ చేస్తున్న‌ప్పుడు ఆ ఒక్క పార్ట్ కోసం 40 టేక్స్ తీసుకున్నార‌ట‌. దాంతో ఆయ‌న‌కు ఒళ్లు మండి వారి ముందే ఫోన్ నేల‌కేసి కొట్టి కోపంతో త‌న కార‌వ్యాన్‌లో వెళ్లి కూర్చున్న‌ట్లు టాక్‌. పుష్ప సినిమా వల్లే అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు వ‌చ్చింది. దాంతో పుష్ప 2పై అంచనాలు మ‌రింత పెరిగిపోయాయి. అందుకే సుకుమార్ ఏ విష‌యంలోనూ రాజీ ప‌డ‌కుండా సినిమాను తీయాల‌ని చూస్తున్నారు.