సైలెంట్‌గా పుష్ప 3 కానిచ్చేస్తున్నారా?

Pushpa 3: సుకుమార్.. (Sukumar) అల్లు అర్జున్ (Allu Arjun) ప్ర‌స్తుతానిక పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మ‌న‌కు తెలిసిన మ్యాట‌ర్ అయితే ఇదే. అయితే మ‌న‌కు తెలీని మ్యాట‌ర్ ఏంటంటే.. వీరిద్ద‌రూ పనిలో ప‌నిగా సైలెంట్‌గా పుష్ప 3 షూటింగ్ కూడా కానిచ్చేస్తున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌స్తుతానికైతే పుష్ప 2కి సంబంధించి చాలా మ‌టుకు షూటింగ్ పూర్త‌యిపోయింది. దాంతో రెండు మూడు పుష్ప 3 సీన్ల‌ను కానిచ్చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబ‌ర్‌కు పుష్ప 3ని పూర్తి చేసేయాల‌ని సుకుమార్ అనుకుంటున్నార‌ట‌. ఇదే విష‌యానికి అల్లు అర్జున్ చెప్తే మీరెలా అంటే అలా మాష్టారూ అన్న‌ట్లు స‌మాచారం. పుష్ప 2, పుష్ప 3కి అల్లు అర్జున్ కానీ సుకుమార్ కానీ ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. వీరిద్ద‌రూ సినిమా రిలీజ్ అయ్యాక వ‌చ్చిన ప్రాఫిట్స్ నుంచి వాటాలు తీసుకోబోతున్నారు.