Sudheer Babu: నా విషయంలో మహేష్ చాలా బాధపడతాడు
Sudheer Babu: 2013లో వచ్చిన ప్రేమ కథా చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుధీర్ బాబు. సూపర్‌స్టార్ మహేష్ బాబు బావగానే కాకుండా టాలీవుడ్లో ఇప్పుడు నవ దళపతిగా స్టార్డం సంపాదించుకున్నారు.
తన లాస్ట్ రిలీజ్ హరోం హర సినిమా మంచి విజయం సాధించిందని.. ఈ ఏడాదిలో కొన్ని సినిమాల షూటింగ్ కూడా పూర్తి చేసానని అన్నారు. ఈ ఏడాది తనకు బాగా కలిసొచ్చిందని తెలిపారు. “” 2023తో పోల్చితే 2024 నాకు బాగా కలిసొచ్చింది. సినిమాలు చేస్తూ హరోం హర విజయాన్ని ఆస్వాదించడంలో సగం ఏడాది అయిపోయిందన్న విషయం కూడా గుర్తులేదు. 2023లో హంట్, మాయా మశ్చీంద్ర సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ ఫ్లాప్స్ గురించి మాత్రమే ఆలోచిస్తుంటే ముందుకు వెళ్లలేం కదా. నా విషయంలో ఏదన్నా జరగరానిది జరిగితే ముందు బాధపడేది నా కుటుంబమే. నా కంటే ఎక్కువ వాళ్లు బాధపడతారు. ఆ బాధలో నేనే వారిని ఓదారుస్తుంటాను. ఇక నా కెరీర్ మొదటి నుంచి మా బావ మహేష్ ఎంతో సపోర్ట్‌గా ఉన్నారు. నేను ఎంత కష్టపడతానో మహేష్‌కి తెలుసు. అలాంటిది నా సినిమా ఫ్లాప్ అయిందని తెలిస్తే నాకంటే ఎక్కువ మహేష్ బాధపడుతుంటాడు “” అని తెలిపారు.