Sudheer Babu: చిన్న బుర్ర‌ల‌కు ప్ర‌భాస్‌ను అనేంత సీన్ లేదు

sudheer babu calls arshad warsi small mind

Sudheer Babu: రెబెల్ స్టార్ ప్ర‌భాస్‌ను ప‌ట్టుకుని జోక‌ర్ అని కామెంట్ చేసిన బాలీవుడ్ న‌టుడు అర్ష‌ద్ వార్సిపై యావ‌త్ టాలీవుడ్ మండిప‌డుతోంది. ఇప్ప‌టికే దీనిపై ఆర్ఎక్స్ 100 ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి స్పందించారు. అర్ష‌ద్ వార్సిని ఇప్పుడు ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆ కుళ్లుతోనే ప్ర‌భాస్‌పై కామెంట్ చేస్తున్నాడ‌ని అన్నారు. ఇప్పుడు న‌టుడు సుధీర్ బాబు త‌న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసారు. విమర్శ చేస్తే అర్థ‌వంతంగా ఉండాలి కానీ నోటికొచ్చిన‌ట్లు వాగ‌కూడ‌ద‌ని అన్నారు. చిన్న బుర్ర‌ల‌కు ప్ర‌భాస్ లాంటి వ్య‌క్తిని అనేంత సీన్ లేదు అని మండిప‌డ్డారు.

అస‌లేం జ‌రిగింది?

క‌ల్కి సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్ క్యారెక్ట‌ర్ చాలా బాగుంద‌ని కానీ ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్, డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం జోక‌ర్‌లా ఉంద‌ని అర్ష‌ద్ వార్సి కామెంట్ చేయ‌డం ర‌చ్చ‌కు దారితీసింది.