Sudheer Babu: వాడిని నా సినిమాలో పెట్టుకున్నందుకు సిగ్గుగా ఉంది
Sudheer Babu: తండ్రీ కూతుళ్ల గురించి అసభ్యకరమైన మాటలు మాట్లాడిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై తాజాగా సుధీర్ బాబు స్పందించారు. వాడు ఇంత నీచుడని తెలీక తాను నటించిన హరోం హర సినిమాలో పెట్టుకున్నానని అన్నారు. అందుకు సిగ్గుపడుతున్నట్లు తెలిపారు.
“” మంచో చెడో నేనైతే సోషల్ మీడియాలో లేను. సోషల్ మీడియాలో జరిగే అంశాలను కూడా పట్టించుకోను. కానీ ఈ ప్రణీత్ హనుమంతు అనే నీచుడిని నా సినిమాలో పెట్టుకున్నందుకు సిగ్గుగా ఉంది. అందుకు మీకు క్షమాపణలు చెప్తున్నాను. వీడు ఇలాంటివాడని నాకు తెలీదు. తెలిసుంటే అసలు అవకాశం ఇచ్చేవాడిని కాదు. అసలు వాడి గురించి ఏం జరిగిందో తెలుసుకునేందుకు సోషల్ మీడియాను ఓపెన్ చేసే ధైర్యం కూడా నేను చేయలేను. ఇలాంటి వారికి అసలు ప్లాట్ఫామే లేకుండా చేయాలి. ఇది ఏ రకంగానూ వాక్స్వాతంత్రం కాదు ““ అని మండిపడ్డారు.