Sudheer Babu: నా సినిమా చూసేవారికి ఒక విన్న‌పం

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు సుధీర్ బాబు (sudheer babu). కానీ స‌మ్మోహ‌నం సినిమా త‌ర్వాత ఆయ‌న‌కు స‌రైన హిట్ లేదు. ఇప్పుడు మామా మశ్చీంద్ర (mama mascheendra) అనే వెరైటీ కాన్సెప్ట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఈ శుక్ర‌వారం సినిమా రిలీజ్ అవ‌బోతోంది. అయితే సినిమా చూడాల‌నుకుంటున్న‌వారికి సుధీర్ బాబు ఒక విన్న‌పం చేసారు. ఎవ్వ‌రూ కూడా మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ పెట్టుకుని సినిమాకు వెళ్లొద్ద‌ని మామూలుగానే చూడాల‌ని రిక్వెస్ట్ చేసారు. మామా మ‌శ్చీంద్ర మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ పెట్టుకుని చూసే సినిమా కాద‌ని అన్నారు.

ఈ సినిమాలో సుధీర్ బాబు వివిధ గెట‌ప్స్‌లో క‌నిపిస్తారు. వాటిలో ద్రుగ అనే గెటప్ ఒక‌టి. ఈ గెట‌ప్ కోసం సుధీర్ బాబు ప్రాస్థెటిక్స్ వాడాల్సి వ‌చ్చింది. అస‌లు ఈ గెట‌ప్‌లో త‌న‌ను ఎవ‌రైనా గుర్తుప‌డ‌తారో లేదో అని తాను ఉంటున్న అపార్ట్‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ప్ర‌యోగం చేయాల‌నుకున్నారు. ప్రాస్థెటిక్ గెట‌ప్‌లో అపార్ట్‌మెంట్ గేట్ ద‌గ్గ‌రికి రావ‌డంతో వాచ్‌మ్యాన్ గుర్తుప‌ట్ట‌లేక‌పోయాడ‌ట‌. అలా సుధీర్‌తో దాదాపు గంట పాటు గొడ‌వ‌ప‌డ్డాడ‌ట‌. ఈ విష‌యాన్ని సుధీర్ ప్రెస్ మీట్‌లో వెల్ల‌డించారు. ఇలాంటి విభిన్న‌మైన సినిమాల‌ను అవార్డుల నామినేష‌న్స్‌కి కూడా పంపుతాని ఈ సంద‌ర్భంగా సుధీర్ వెల్ల‌డించారు.