Suchitra: ఆమె వ‌ల్ల ఎంద‌రో అమ్మాయిలు క‌న్య‌త్వాన్ని కోల్పోయారు

Suchitra says many girls have lost virginity at rima kallingal parties

Suchitra: ప్ర‌ముఖ గాయ‌ని సుచిత్ర ఎప్ప‌టిక‌ప్పుడు షాకింగ్ విష‌యాల‌ను బ‌య‌ట‌పెడుతుంటారు. ఆమెను ఎవ‌రైనా ఇంట‌ర్వ్యూకి పిలిచారంటే క‌చ్చితంగా ఏదో ఒక బాంబ్ పేలుస్తార‌ని అంతా భ‌య‌ప‌డుతుంటారు. ఇప్పుడు కూడా అదే జ‌రిగింది. ఆల్రెడీ మాలీవుడ్ (మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌)లో హేమ క‌మిటీ రిపోర్ట్ సంచ‌ల‌నం రేపింది. ఎంద‌రో న‌టీమ‌ణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బ‌య‌ట‌పెడుతున్నారు.

ఈ నేప‌థ్యంలో సుచిత్ర మ‌ల‌యాళ న‌టి రీమా క‌ల్లింగ‌ల్ గురించి షాకింగ్ విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టారు. రీమా ఎప్పుడూ త‌న ఇంట్లో పార్టీలు నిర్వ‌హిస్తూ ఉండేద‌ని.. ఈ పార్టీల‌కు చిన్నా పెద్దా మ‌గ‌, ఆడ అనే తేడా లేకుండా చిత్ర ప‌రిశ్ర‌మ మొత్తం వెళ్లేద‌ని అన్నారు. పార్టీలో తీసుకోకూడ‌ని డ్ర‌గ్స్ కూడా అందుబాటులో ఉండేవ‌ని.. ఈ డ్ర‌గ్స్ వ‌ల్ల ఆ పార్టీలో ఎంద‌రో ఆడ‌పిల్ల‌లు త‌మ క‌న్య‌త్వాన్ని కోల్పోయార‌ని ఆరోపించారు. ఆ పార్టీల‌కు వెళ్లిన ఎంద‌రో మ‌ల‌యాళ గాయ‌నీ గాయ‌కులు తాము చూడ‌కూడ‌ని దృశ్యాల‌ను రీమా క‌ల్లింగ‌ల్ పార్టీలోనే చూసామ‌ని త‌న‌తో చెప్పార‌ని సుచిత్ర తెలిపారు.