Sardar 2: స‌ర్దార్ 2 సెట్స్‌లో ఘోరం

stuntman dies on sardar 2 sets

Sardar 2: ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు కార్తి న‌టిస్తున్న స‌ర్దార్ 2 సెట్స్‌లో ఘోరం చోటుచేసుకుంది. స్టంట్‌మెన్‌గా ప‌నిచేస్తున్న ఎళుమ‌లై అనే వ్య‌క్తి 20 అడుగుల ఎత్తు నుంచి ప‌డి దుర్మ‌ర‌ణం చెందాడు. యాక్ష‌న్ సన్నివేశం చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని చిత్ర‌బృందం తెలిపింది. త‌లకు తీవ్ర గాయం కావ‌డంతో ఆయ‌న చనిపోయిన‌ట్లు పోలీసులు తెలిపారు. ప్ర‌స్తుతం షూటింగ్‌ను ఆపేసారు. ఎళుమలై కుటుంబీకుల‌ను కార్తి ప‌రామ‌ర్శించి వారికి ఆర్థిక సాయం చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.