SSMB28: మహేష్​, పూజ లుక్స్​ లీక్​!

Hyderabad: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం SSMB28 లో నటిస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ మూవీలో మహేష్ సరసన పూజ హెగ్డే (Pooja Hegde), శ్రీలీల (Sreeleela) నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచి లీకుల బెడద తప్పడం లేదు.  తాజాగా మరో ఫొటో లీకయ్యింది. ఈ ఫొటోలో ఒక షాపింగ్ మాల్​లో జరుగున్న సన్నివేశాన్ని మహేష్, పూజతో తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్.

ఇక ఈ షూటింగ్​ని ఒక అభిమాని ఫోటో తీసి నెట్టింట పెట్టగా, అది కాస్త వైరల్ గా మారింది. ఆ ఫోటోలో త్రివిక్రమ్, పూజాకి సీన్ వివరిస్తుండగా మహేష్ బాబు పక్కన నిలబడి కనిపిస్తున్నాడు. ఇక ఈ పిక్ లో మహేష్ చెక్స్ షర్ట్ లో, పూజా లంగా ఓణిలో కనిపిస్తున్నారు. కాగా ఇటీవల ఈ మూవీ నుంచి మహేష్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా సోషల్ మీడియా అంతా షేక్ అయ్యింది. మహేష్ రఫ్ లుక్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ పోస్టర్ తో సినిమా పై అంచనాలు మరింత పెరిగి పోయాయి.

కాగా ఇంకా టైటిల్​ ఫిక్స్​కాని ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.