SSMB 29: ఆఫ్రిక‌న్ అడ్వెంచ‌ర్.. హాలీవుడ్ న‌టుడు..!

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్ రాజ‌మౌళి.. (rajamouli) సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు (mahesh babu) కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతానికైతే SSMB 29 అనేది వ‌ర్కింగ్ టైటిల్. దీనిపై మ‌రోసారి హైప్ పెంచేసే అప్డేట్స్ ఇచ్చారు రాజ‌మౌళి తండ్రి, ర‌చ‌యిత విజయేంద్ర ప్రసాద్ (vijayendra prasad). ఇదొక ఆఫ్రిక‌న్ అడ్వెంచ‌ర్ (african adventure) సినిమా అని ఇందులో హాలీవుడ్ న‌టుడు కూడా యాక్ట్ చేయ‌బోతున్నాడ‌ని అన్నారు. అయితే ఎవ‌రా హాలీవుడ్ న‌టుడు అనే వివ‌రాలు మాత్రం వెల్లడించ‌లేదు. హాలీవుడ్ న‌టుడు మ‌హేష్ బాబు సినిమా అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదుగా..!