SSMB 29: ఇదేం టైటిల‌య్యా జ‌క్క‌న్న‌..!

SSMB 29 to be titled as gold

SSMB 29: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్న చిత్ర‌మిది. ఎప్పుడెప్పుడు మ‌హేష్ ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ ఎస్ రాజ‌మౌళితో క‌లిసి న‌టిస్తారా అనుకుంటున్న స‌మ‌యం మొత్తానికి ఆస‌న్న‌మైంది. జ‌ర్మనీలో షూటింగ్ మొద‌లుకాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ టాపిక్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. సినిమాకు జ‌క్క‌న్న ఓ టైటిల్ అనుకుంటున్నార‌ట‌. ఆ టైటిల్ ప‌ట్ల మిక్స్‌డ్ రివ్యూలు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఏంటా టైటిల్ అంటే.. గోల్డ్. అవును మీరు చ‌దివింది నిజ‌మే. ఈ సినిమాకు గోల్డ్ అనే టైటిల్ పెట్టాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.

గోల్డ్ అనేది యూనివ‌ర్స‌ల్ పేరు కాబట్టి దానినే టైటిల్‌గా ఫిక్స్ అవుతార‌ని టాక్. అయితే ఇలాంటి టైటిల్స్ చిన్న హీరోల సినిమాల‌కు ప‌నికొస్తాయేమో కానీ రాజ‌మౌళి మ‌హేష్ లాంటి అంత‌ర్జాతీయ స్టార్‌డం ఉన్న‌వారికి ఎలా స‌రిపోతాయి అనే టాక్ న‌డుస్తోంది. ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు కాబ‌ట్టి ఏం కంగారుప‌డాల్సిన ప‌ని లేదు. ఇక త‌మిళ న‌టుడు విక్ర‌మ్ ఇందులో విల‌న్ పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఆగ‌స్ట్ 9న మ‌హేష్ బ‌ర్త్‌డే. మ‌రి ఆరోజు ఏమ‌న్నా స్పెష‌ల్ అనౌన్స్‌మెంట్ చేస్తారేమో చూడాలి.