SSMB 29: విజ‌యేంద్ర ప్ర‌సాద్ కీల‌క అప్డేట్

ssmb 29 shoot starts from january 2025 says vijayendra prasad

SSMB 29: ఎస్ ఎస్ రాజ‌మైళి.. సూపర్‌స్టార్ మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో రాబోతున్న SSMB 29 పై రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ కీల‌క అప్డేట్ ఇచ్చారు. 2025 జ‌న‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంద‌ని అన్నారు. ఇప్ప‌టికే మ‌హేష్ ఈ సినిమా కోసం త‌న గెట‌ప్‌ను మ‌రింత స్టైలిష్‌గా మార్చుకున్నారు. పొడ‌వాటి జుట్టు గెడ్డంతో హాలీవుడ్ నటుడిగా మారిపోయారు. సినిమా షూటింగ్‌కి ముందే లుక్స్‌తో క‌ట్టిప‌డేస్తున్న మ‌హేష్ ఇక షూటింగ్ మొద‌ల‌య్యాక వ‌చ్చే పిక్చ‌ర్స్‌లో ఎలా ఉంటారా అని ఇప్ప‌టి నుంచే భారీ అంచ‌నాలు పెరిగిపోయాయి.