నాకు పర్మిషన్ ఇవ్వలేదు సర్: మహీంద్రాకు రాజమౌళి రిప్లై
Hyderabad: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా(anand mahindra)..దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి(ss rajamouli) మధ్య ఇంట్రెస్టింగ్ సంభాషణ జరిగింది. సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా.. వివిధ అంశాలపై స్పందించేందుకు ఎప్పుడూ ముందుంటారు. అయితే ఆయన నిన్న పురాతన ఆచారాలు, సంప్రదాయాల గురించి ట్వీట్ చేస్తూ జక్కన్నను ట్యాగ్ చేసారు. హరప్పా కల్చర్ సమయంలోని సంప్రదాయాలపై ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తూ.. “ఇలాంటి అద్భుతమైన కల్పికలు మన చరిత్రను సజీవంగా ఉంచుతున్నాయి. మనలో ఆలోచన ధోరణిని మేల్కొపుతున్నాయి. అప్పటి యుగాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూ రాజమౌళి ఓ సినిమా తీస్తే బాగుంటుంది అనుకుంటున్నా” అని ట్వీట్ చేసారు.
ఇందుకు జక్కన్న రిప్లై ఇస్తూ.. “తప్పకుండా సర్..ఢోలావీరాలో మగధీర షూటింగ్ చేస్తున్నప్పుడు ఓ పురాతన చెట్టు శిలాజముగా మారిపోవడం చూసాం. ఆ చెట్టు ద్వారా ఇండస్ వ్యాలీ నాగరికత ఎలా మొదలై అంతమైందో సినిమా తీయాలన్న ఆలోచన కలిగింది. అలా కొన్నేళ్ల తర్వాత పాకిస్థాన్ వెళ్లాను. కానీ మొహెంజొదారో చూడటానికి చాలా ట్రై చేసాను కానీ నాకు పర్మిషన్ ఇవ్వలేదు” అని అన్నారు.