Rajamouli: “ఛ‌త్ర‌ప‌తి” శ్రీనివాస్‌కి సూట్ అవుతుంద‌నే అనుకుంటున్నా

Hyderabad: ఛ‌త్ర‌ప‌తి(chatrapathi) లుక్‌లో శ్రీనివాస్ బెల్లంకొండ(srinivas bellamkonda) చ‌క్కగా స‌రిపోయాడ‌ని అన్నారు ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్ రాజ‌మౌళి(rajamouli). 2005లో ప్ర‌భాస్‌కు. ఛ‌త్ర‌ప‌తితో ఇండ‌స్ట్రీ హిట్ ఇచ్చారు రాజ‌మౌళి. ఇప్పుడు అదే సినిమాను సేమ్ టైటిల్‌తో బాలీవుడ్‌లో రిలీజ్ చేయ‌నున్నారు వి.వి వినాయ‌క్. ఇందులో హీరోగా శ్రీనివాస్ బెల్లంకొండ న‌టించారు. బాలీవుడ్ న‌టి నుష్ర‌త్ బ‌రూచా హీరోయిన్‌. మే 12న సినిమా రిలీజ్ అవుతున్న సంద‌ర్భంగా రాజ‌మౌళి.. టీంకు విషెస్ తెలిపారు. “ఛ‌త్ర‌ప‌తి మే 12న రిలీజ్ అవ‌బోతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే.. ఈ సినిమాను వివి వినాయ‌క్ తీసారు. ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీలోనే ఆయ‌న మాస్ డైరెక్ట‌ర్. బెల్లంకొండ శ్రీనివాస్ ఆల్రెడీ మాస్ యాక్ట‌ర్‌గా ప్రూవ్ చేసుకున్నారు. ఛ‌త్ర‌ప‌తి స్టోరీ ఆయ‌న‌కు బాగా సూట్ అవుతుంది అనుకుంటున్నా” అని తెలిపారు.