Sriranga Neethulu: సుహాస్​ బ్యాక్ టు బ్యాక్​ సినిమాలు!

Hyderabad: తొలి సినిమా కలర్‌ఫొటోతో సాలిడ్​ హిట్​ అందుకున్న యంగ్​ హీరో సుహాస్‌ (Suhas). ఈ ఏడాది రైటర్‌ పద్మభూషణ్‌గానూ ప్రేక్షకులను అలరించాడు. ఓవైపు సపోర్టింగ్​ రోల్స్​ చేస్తూనే హీరోగానూ బ్యాక్​ టు బ్యాక్​ సినిమాలను లైన్లో పెట్టాడు సుహాస్​. ఇప్పటికే అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్ (Ambajipeta Marriage Band) సినిమా షూటింగ్​తో బిజీగా ఉన్న సుహాస్ తాజాగా​ మరో సినిమా టైటిల్​ను అనౌన్స్​ చేశాడు.

ప్రవీణ్‌ కుమార్ వీఎస్‌ఎస్‌ దర్శకత్వం వహిస్తున్న సుహాస్​ నటిస్తున్న ఈ మూవీ టైటిల్‌ అనౌన్స్ మెంట్‌ పోస్టర్‌ను లాంఛ్‌ చేశారు. ఈ సినిమా టైటిల్​ శ్రీరంగనీతులు (Sriranga Neethulu).  కేరాఫ్‌ కంచరపాలెం ఫేం కార్తీక్‌ రత్నం కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. రుహాణీ శర్మ హీరోయిన్​గా నటిస్తున్న ఈ సినిమాని వెంకటేశ్వర్‌ బల్మూరి నిర్మిస్తున్నారు.

సుహాస్‌ ఈ సినిమాతోపాటు ఇప్పటికే ఆనందరావ్‌ అడ్వంచర్స్ అనే టైటిల్‌తో మరో సినిమా కూడా లాంఛ్ చేశాడు. రామ్‌ పసుపులేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఈ రెండు సినిమాల రిలీజ్​ డేట్​ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.