Srinu Vaitla: మ‌హేష్ ఇంకో సినిమా చేద్దామ‌న్నారు

Srinu Vaitla mahesh babu wanted to do another film

Srinu Vaitla: శ్రీను వైట్ల మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన దూకుడు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యి ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌లేదు. అందుకే వెంట‌నే మ‌హేష్ శ్రీనుతో క‌లిసి ఆగ‌డు సినిమాకు సంత‌కం చేసారు. ఈ సినిమా కూడా దూకుడు మాదిరే బాగా ఆడుతుంద‌ని అనుకున్నారు కానీ ఫ్లాప్ అయ్యింది. సినిమాలో ఉండాల్సిన హంగుల‌న్నీ ఉన్నాయి కానీ ఏదో మిస్స‌యింది. దాంతో సినిమా ఆడ‌లేదు. ఈ సినిమా ఫ్లాప్ అయింద‌ని తెలిసాక కూడా మ‌హేష్ శ్రీనుకి ఫోన్ చేసి ఇంకో సినిమా చేద్దాం స్క్రిప్ట్ రెడీ చేసుకో అన్నార‌ట‌. ఈ విష‌యాన్ని శ్రీను వైట్ల స్వ‌యంగా వెల్ల‌డించారు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల తానే ఇంకో క‌థ‌తో మ‌హేష్ ద‌గ్గ‌రికి వెళ్లలేక‌పోయార‌ట‌. ఇప్ప‌టికీ త‌న‌కు మ‌హేష్‌కి మ‌ధ్య మంచి బాండింగ్ ఉంద‌ని వెల్ల‌డించారు.