Srikanth: నా గురించి రూమర్ వస్తే చిరంజీవి నమ్మరు
Srikanth: బెంగళూరు రేవ్ పార్టీలో తాను ఉన్నానని వార్తలు రాగానే ముందుగా మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసానని అన్నారు నటుడు మేక శ్రీకాంత్. తనలాగే ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడంతో అంతా శ్రీకాంత్ రేవ్ పార్టీలో దొరికాడని అనుకున్నారని.. ఆ తర్వాత తాను క్లారిటీ ఇచ్చాక అప్పుడు అందరూ నమ్మారని తెలిపారు. అయితే ఇలా రేవ్ పార్టీ విషయం బయటికి రాగానే ముందుగా తాను చిరంజీవికే కాల్ చేసానని.. అదే రోజు ఆయన ఇంటికి వెళ్లి దీని గురించి మాట్లాడానని తెలిపారు.
“” నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లు ఇంటికి వస్తే ఇంట్లోనే కూర్చుని కబుర్లు చెప్పుకుంటాం తప్ప పార్టీలకు వెళ్లం. ఖాళీ సమయాల్లో నేను నా కుటుంబంతో కలిసి ఆలయాలకు వెళ్తుంటాను. అంతేకానీ ఇలా రేవ్ పార్టీలకు వెళ్లే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. ఈ విషయం చిరు అన్నయ్యకు కూడా తెలుసు. ఈ విషయం గురించి నేను అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పినప్పుడు ఛీ ఛీ అతనికి కనీసం జుట్టు కూడా లేదు అయినా నువ్వు అలాంటి పార్టీలకు వెళ్లవు అని నాకు తెలుసు అన్నారు. ఇలాంటి అలవాట్లు ఉన్నవారిని చిరు అన్నయ్య అసలు దగ్గరికి కూడా రానివ్వరు. ఇలా తెలుగు ఇండస్ట్రీకి చెందినవారు పార్టీకి వెళ్లారని తెలిసి ఆయన చాలా బాధపడ్డారు. పిల్లలు యువత ఏమైపోతారు అని చర్చించుకున్నాం. నా గురించి అన్నయ్యకు బాగా తెలుసు కాబట్టే నాకు సంబంధించి ఏ వార్త వచ్చినా కూడా ఆయన నమ్మరు “” అని తెలిపారు.