రేవ్ పార్టీ ఘటన.. అతను నాలాగే ఉన్నాడు కానీ నేను కాదు
Srikanth: బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న ఓ ఫాం హౌజ్లో నిన్న అర్థరాత్రి రేవ్ పార్టీ జరిగింది. వాసు అనే వ్యక్తి తన పుట్టినరోజు కావడంతో ఈ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో సినీ నటులు, ఎమ్మెల్యేలు అంతా కలిపి దాదాపు 200 మంది పాల్గొన్నారు. పార్టీలో డ్రగ్స్ వాడకం కూడా ఉందని పోలీసులు గుర్తించారు. నటి హేమ, శ్రీకాంత్, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ కూడా ఉన్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే హేమ క్లారిటీ ఇచ్చారు. తాను అసలు పార్టీలో లేనని.. తన ఫాం హౌస్ కూడా బెంగళూరులోనే ఉందని అన్నారు.
మరోపక్క శ్రీకాంత్ కూడా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. తనది రేవ్ పార్టీలకు వెళ్లే కల్చర్ కాదని.. తెలీక వెళ్లినా ఒక అరగంట ఉండేసి వచ్చేస్తాను కానీ డ్రగ్స్ తీసుకోవడం వంటివి చేయనని అన్నారు. కానీ మీడియాలో తనలాగే ఉన్న వ్యక్తి ఫోటోలు కనిపిస్తుండడంతో ప్రజలు మీడియా వర్గాలు కన్ఫ్యూజ్ అవుతున్నారని.. అందుకే క్లారిటీ ఇస్తున్నానని పేర్కొన్నారు. తాను హైదరాబాద్లోని తన నివాసంలోనే ఉన్నట్లు వెల్లడించారు.