Allu Arjun ఫ్యాన్స్‌కి సారీ

Hyderabad: ఏంటి కామెడీ యా.. ఏంటి దొబ్బేస్తారా.. ఏంటి దాదాగిరీ యా.. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ ఫేమ‌స్ అయిపోయాడు శ్రీ తేజ‌ (sri teja). ఇత‌ను కొంత‌కాలం క్రితం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun) న‌టించిన దేశ‌ముదురు సినిమాలోని డైలాగ్‌ను ఇమిటేట్ చేసి తెగ ఫేమ‌స్ అయిపోయాడు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అంతా ఇత‌ని డైలాగ్‌తో మారుమోగిపోతోంది. దాంతో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఇత‌ను ఎవ‌రో తెలుసుకుని మ‌రీ ఇంట‌ర్వ్యూలు చేసేస్తున్నాయి. అయితే అల్లు అర్జున్‌ని (allu arjun) ఇమిటేట్ చేసినందుకు ఆయ‌న ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఈ విష‌యం శ్రీ తేజ‌కు కూడా అర్థమైన‌ట్లుంది. అందుకే ఫ్యాన్స్‌కి అల్లు అర్జున్‌కి క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. బ‌న్నీని కానీ ఫ్యాన్స్‌ని కానీ హ‌ర్ట్ చేయాల‌న్న ఉద్దేశం త‌న‌కు లేద‌ని, తాను కూడా బ‌న్నీ ఫ్యానే అని తెలిపాడు.