Sreelekha: రాజమౌళి కజిన్‌ని అయితే.. అవార్డులు ఇచ్చేస్తారా?
ఇటీవల అనౌన్స్ చేసిన జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో (national film awards) భాగంగా RRR సినిమాకు గానూ ఎం ఎం కీరవాణికికి (mm keeravani) బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు గానూ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. అయితే ఇది నిజాయతీగా వచ్చిన అవార్డు కాదని.. లాబీయింగ్‌కు పాల్పడి మరీ తెచ్చుకున్న అవార్డ్ అని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై స్పందించారు కీరవాణి చెల్లెలు, ప్రముఖ సింగర్ శ్రీలేఖ (sreelekha).
“” తెలుగు సినిమాలకు నేషనల్ అవార్డులు రాకపోతే ఇండస్ట్రీ చేతకానితనం అంటారు. అదే అవార్డ్ వస్తే.. లాబీయింగ్‌కి పాల్పడి మరీ తెచ్చుకున్నాం అంటారు. ఇది ఎక్కడ ఆగుతుంది? సినిమాలు, యాక్టర్ల మెరిట్‌ని బట్టే నేషనల్ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఫలానా యాక్టర్‌కి అవార్డు వచ్చినప్పుడు వారిని మెచ్చుకోవాల్సిందిపోయి ఈ నెగిటివిటీ ఎందుకు? విమర్శించేవారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అవార్డు అనేది సినిమాకు ఎన్ని కలెక్షన్లు వచ్చాయి అనే దానిపై ఆధారపడి ఉండదు. నేను రాజమౌళి, కీరవాణి కజిన్ అయినంత మాత్రాన జ్యూరీ సభ్యురాలిగా ఉంటూ నచ్చిన వారికి అవార్డులు ఇచ్చుకోవడం అనేది ఉండదు. ఒక సినిమాకు అవార్డు ఎందుకు ఇవ్వాలి అనేదానిపై గంటల తరబడి చర్చ ఉంటుంది. ఆ చర్చలో పాల్గొన్నవారికి అన్ని వాదనలు సరైనవే అనిపిస్తేనే అవార్డుకు ఎంపికచేస్తారు. నేను వివిధ భాషల్లో 70కి పైగా సినిమాలకు సంగీతం అందించాను. దాదాపు 4000 లకు పైగా పాటలు పాడాను. నా పనితనాన్ని చూసే నేషనల్ అవార్డ్స్ కమిటీలో జ్యూరీ మెంబర్‌గా పెట్టారు “” అని తెలిపారు శ్రీలేఖ. (sreelekha)