Anasuya: ఆఖ‌రికి శ్రీలీల చేతా అనిపించుకుంది..!

Hyderabad: నిన్న కాక మొన్న వ‌చ్చిన న‌టి శ్రీలీల(sreeleela) కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ‌కే(vijay devarakonda) స‌పోర్ట్ చేస్తోంది. యాంక‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్(anasuya), విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌ధ్య జ‌రుగుతున్న ఫైట్ గురించి తెలిసిందే. విజ‌య్ దేవ‌రకొండ సినిమా పోస్ట‌ర్ల‌పై ద అని రాయించుకోవ‌డం అన‌సూయ‌కు మింగుడుప‌డ‌లేదు. దాంతో దీన్ని పైత్యం అంటారు అంటూ కామెంట్లు చేసింది. అయితే ఈరోజు విజ‌య్ దేవ‌రకొండ బ‌ర్త్‌డే కావ‌డంతో చాలా మంది సెల‌బ్రిటీలు ఆయ‌న‌కు విష్ చేసారు. వారంతా కావాలని THE అనే పదాన్ని హైలైట్ చేస్తూ విష్ చేయ‌డం వైర‌ల్‌గా మారింది. ద‌ర్శకుడు హ‌రీశ్ శంక‌ర్‌, న‌టుడు బ్రహ్మాజీల‌తో పాటు శ్రీలీల కూడా విష్ చేసింది. విజ‌య్ కామ‌న్ డిస్‌ప్లే పిక్చ‌ర్‌ను రిలీజ్ చేసిన శ్రీలీల‌.. ఆయ‌న THE విజ‌య్ దేవ‌ర‌కొండ‌నే.. సౌతిండియా ఇండ‌స్ట్రీలోనే సెన్సేష‌న్ అంటూ తెగ పొగిడేసింది. అయితే విజ‌య్‌తో క‌లిసి శ్రీలీల ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఆ చ‌నువుతో ఇలా తెగ పొగిడేస్తోందో ఏమో తెలీదు కానీ.. మొత్తానికి అన‌సూయ నిన్న కాక మొన్న వ‌చ్చిన శ్రీలీలతో కూడా అనిపించుకుంటోంది అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.