SPY: సుభాష్ చంద్రబోస్ మిస్టరీతో రానున్న నిఖిల్​.. రిలీజ్​ ఎప్పుడంటే?

Hyderabad: టాలీవుడ్(Tollywood)​ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్​(Nikhil Siddharth) నటిస్తున్న తాజా చిత్రం ‘స్పై’(SPY). ఈ సినిమా అనౌన్స్​ చేసినప్పటి నుంచీ చాలా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను పూర్తి స్పై థ్రిల్లర్​గా రూపొందిస్తుండటంతో రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత్‌కు సంబంధించిన హిడెన్ స్టోరితో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్రయూనిట్ తెలిపింది. సుభాష్​ చంద్రబోస్​ మిస్టరీతో రానున్న ఈ సినిమాను గ్యారీ(Garyy) డైరెక్ట్ చేస్తుండగా, నిఖిల్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. కాగా, ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ మిస్టరీని చూపించనున్నట్లుగా  తెలుస్తోంది. ఈ మూవీని జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్​.

ఇక ఈ సినిమా టీజర్‌ను మే 12న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమా నుండి వచ్చిన తాజా అప్డేట్‌తో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ మూవీలో ఐశ్వర్య మీనన్(Aishwarya Menon) హీరోయిన్‌గా నటిస్తోండగా, కె.రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్​ స్పై సిరీస్​ రేంజ్​లో ఈ మూవీ ఉండబోతోందని తెలుస్తోంది.