లారెన్స్ బిష్ణోయ్‌కి స‌ల్మాన్ మాజీ ప్రేయ‌సి రిక్వెస్ట్

somi ali request to lawrence bishnoi

Somi Ali: బాలీవుడ్ సూపర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్ మాజీ ప్రేయ‌సి సోమీ అలీ.. గ్యాంగ్‌స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్‌కి ఓ రిక్వెస్ట్ చేసింది. లారెన్స్ బిష్ణాయ్ చంపాల‌నుకున్న‌వారిలో స‌ల్మాన్ ఖాన్ మొద‌టి స్థానంలో ఉన్నాడు. దాంతో స‌ల్మాన్‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం క్షేత్ర స్థాయిలో సెక్యూరిటీ క‌ల్పించింది. ఈ నేప‌థ్యంలో సోమీ అలీ ఓ పోస్ట్ పెట్టింది. “” లారెన్స్ భాయ్.. నువ్వు జైలు నుంచి కూడా జూమ్ కాల్స్‌లో మాట్లాడ‌తావ్ అంట క‌దా. నాకు నీతో మాట్లాడాల‌ని ఉంది. నాకు రాజ‌స్థాన్ అంటే ఎంతో ఇష్టం. అక్క‌డి ప్ర‌తిష్ట‌మైన ఆల‌యాన్ని సంద‌ర్శించాల‌ని అనుకుంటున్నాను. అంత‌కంటే ముందు నీతో మాట్లాడాలి. కుదిరితే నీ నెంబ‌ర్ నాకు చేరేలా చేయ్‌. ఇది నీకే మంచి చేకూరుస్తుంది“”  అని పోస్ట్ చేసింది.