Sobhita Dhulipala: నిశ్చితార్థం ఎఫెక్ట్.. అక్కినేని కోడ‌లి రికార్డ్..!

Sobhita Dhulipala tops imdb rankings

Sobhita Dhulipala:  ప్ర‌ముఖ న‌టి, అక్కినేని నాగార్జునకు కాబోయే కోడ‌లు శోభిత ధూళిపాళ రికార్డు సృష్టించారు. నాగ‌చైత‌న్య‌తో నిశ్చితార్థం జ‌రిగిన నేప‌థ్యంలో ఆమె గురించే సోష‌ల్ మీడియాలో వెతికారు. గూగుల్‌లో, సోష‌ల్ మీడియాలో శోభిత పేరు మారుపోగిపోయింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ రేటింగ్స్ వెబ్‌సైట్ IMDBలో రెండో స్థానంలో ఉన్నారు. టాప్ మొద‌టి స్థానంలో బాలీవుడ్ న‌టి శార్వరి వాఘ్ ఉన్నారు. ముంజ్యా సినిమా రిలీజ్ అవ‌డంతో శార్వ‌రి టాప్‌లో ట్రెండ్ అవుతున్నారు. ఆ త‌ర్వాత స్థానంలో శోభిత ధూళిపాల ఉండ‌గా.. మూడో స్థానంలో షారుక్ ఖాన్ ఉన్నారు.