Sobhita Dhulipala: తొలిసారి చై పేరు చెప్పిన శోభిత
Sobhita Dhulipala: నాగ చైతన్య, శోభిత ధూలిపాళ్ల డేటింగ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మ్యాటర్ బయటికి చెప్పడంలేదు కానీ ఒకే దగ్గర ఉన్న ఫోటోలు పోస్ట్ చేయడం.. ఒకే రకమైన వస్తువులను పోస్ట్ చేస్తూ హింట్స్ ఇస్తున్నారు. ఇప్పటివరకు శోభిత ఏ ఇంటర్వ్యూలోనూ నాగ చైతన్య పేరును కనీసం పొరపాటున కూడా ఎత్తలేదు. అలాంటిది తొలిసారి చై అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. అయితే చై అంటే CHAY కాదు.. CHAI అని పెట్టింది.
అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల శోభిత మహారాష్ట్రలోని ఓ ప్రాంతానికి వెకేషన్ కోసం వెళ్లింది. అక్కడి ఫోటోలను పోస్ట్ చేసింది. అయితే అదే రోజు నాగ చైతన్య కూడా ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్.. శోభిత పెట్టిన పోస్ట్ ఒకేలా ఉన్నాయి. దాంతో వారిద్దరూ కలిసే వెకేషన్‌కు వెళ్లారు అనే వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై శోభిత స్పందిస్తూ.. I AM NOT EVERYONE’S CUP OF CHAI AND THATS OKAY అని పోస్ట్ చేసారు. అసలైతే ఇంగ్లీష్‌లో I AM NOT EVERYONE’S CUP OF TEA అంటారు. కానీ శోభిత కావాలని చై అని పెట్టి తన రిలేషన్‌షిప్‌ని కాస్త అధికారికంగా ప్రకటించేసినట్లుగా ఉంది.
ప్రస్తుతానికైతే నాగ చైతన్య, శోభితలకు పెళ్లి అనే ఆలోచన లేదని.. కొంతకాలం పాటు తమ ప్రేమ జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారని సన్నిహితులు అంటున్నారు.