Sobhita Dhulipala: పెళ్లిపై స్పందించిన శోభిత
Sobhita Dhulipala: ఆగస్ట్ 8న శోభిత ధూళిపాల.. అక్కినేని నాగచైతన్య నిశ్చితార్థం జరిగింది. అప్పటివరకు వీరిద్దరూ ఒకరితో ఒకరికి పరిచయం లేనట్లు నటించినప్పటికీ.. వీరిద్దరూ కలిసి తిరిగినప్పటి వీడియోలు, ఫోటోలు బయటికి రావడంతో రూమర్స్ మరింత పెరిగాయి. ఆ రూమర్స్‌కి ఆగస్ట్ 8 ఓ ఫుల్‌స్టాప్ పడింది. ఇక పెళ్లి గురించి అక్కినేని ఇంట్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కినేని కుటుంబంలో అడుగుపెట్టనున్న శోభిత పెళ్లి గురించి నిశ్చితార్థం గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు.
“” ఆగస్ట్ 8న మా నిశ్చితార్థం జరిగింది. నాకు ఆడంబరంగా గ్రాండ్‌గా చేసుకోవాలని అనిపించలేదు. నేను ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నానా లేదా అనేదే నాకు ముఖ్యం. నిశ్చితార్థం నేను అనుకున్నట్లుగానే జరిగింది. మన జీవితంలో ఏదైనా ప్రత్యేకమైనది జరుగుతున్నప్పుడు కలిగే ఆనందం కంటే దానికి మనం చేసే అలంకరణలు ఆడంబరాలు ముఖ్యం కాదు. నేను ఎక్కడికి వెళ్లినా నా తెలుగు సంప్రదాయాలను ఫాలో అవుతూనే ఉన్నాను. ఓ సాధారణ తెలుగింటి అమ్మాయిలానే నేను పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి అనుకున్నాను. ఈ విషయంలో నేను చాలా క్లియర్‌గా ఉన్నాను. పెళ్లి తేదీ గురించి మేమే ప్రకటిస్తాం. పెళ్లి నేను లగ్నం చీర కట్టుకుంటానని అనుకుంటున్నాను “” అని తెలిపారు.