Sobhita Dhulipala: మన ప్రేమ ఎర్రటి మట్టి వర్షం లాంటిది.. చైతో నిశ్చితార్థం తర్వాత శోభిత తొలి పోస్ట్
Sobhita Dhulipala: నటి శోభిత ధూళిపాల.. నాగచైతన్యల నిశ్చితార్థం నిన్న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థానికి సంబంధించిన తొలి ఫోటోలను శోభిత ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసారు. చైతో తన ప్రేమ గురించి ఆమె రాసిన కవిత్వం వైరల్ అవుతోంది. సంగం అనే తమిళ సాహిత్యంలోని కెంపులప్పేయనిరార్ రాసిన కవిత్వాన్ని ఆమె ఆంగ్లంలో అనువదిస్తూ ఇలా రాసారు.
“” మా అమ్మానాన్నలు నీకేమవుతారని.. అసలు మనం ఎలా కలుసుకున్నాం… మన ప్రేమ మాత్రం ఎర్రటి నేల వర్షం లాంటిది “” అని పేర్కొన్నారు. ఈ కవిత్వానికి అర్థమేంటంటే.. ప్రేమ అనేది ఇంట్లో బంధుత్వాలకు మించినది. మన ప్రేమ సామాజిక నిబంధనలు ప్రణాళికాబద్ధమైన సంఘటనల ద్వారా ఏర్పడింది కాదు. తలరాతలో రాసుంది కాబట్టే కలిసాం. ప్రేమలో మాత్రం మనిద్దరం ఎర్రటి నేల.. ఆ నేలను తాకే వర్షం లాంటిది. ఎలాగైతే వర్షం ఎర్రటి నేలను తాకితే అది పులకరిస్తుందో మన ప్రేమ కూడా ఎప్పటికీ అలా నేల వర్షం లాగా ఎప్పటికీ విడదీయలేనిది అని అర్థం.