SK21: కమల్​ హాసన్​ నిర్మాణంలో శివకార్తికేయన్​ సినిమా!

Chennai: విభిన్న కథలను ఎంచుకుంటూ సక్సెస్​ఫుల్​గా సాగుతున్న కోలీవుడ్​ హీరో శివకార్తికేయన్​(Sivakartikeyan). ఈ యంగ్​ అండ్​ టాలెంటెడ్​ హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే తాను నటించిన మహావీరుడు(Mahaveerudu), అయలాన్(Ayalaan)​ సినిమాల రిలీజ్​ డేట్​ ఫిక్స్​ చేసుకున్న శివకార్తికేయన్​ తాజాగా మరో సినిమా పట్టాలెక్కించేశారు. ఈసారి శివకార్తికేయన్​కి జోడీగా లేడీ పవర్​స్టార్​ సాయిపల్లవి(Sai Pallavi) నటించనుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో యూనివర్సల్​ స్టార్​ కమల్ హాసన్(Kamal Haasan) నిర్మాణంలో రూపొందనున్న సినిమాని శుక్రవారం చెన్నై లో అట్టహాసంగా లాంచ్ చేశారు.

కోలీవుడ్​ ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ తెరకెక్కించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని రెగ్యులర్​ షూటింగ్​ ప్రారంభించేందుకు సిద్ధమైంది. SK21 తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమానికి సాయి పల్లవి, శివ కార్తికేయన్, కమల్ హాసన్, దర్శకుడు మరో నిర్మాత మహేంద్రన్ తదితరులు హాజరయ్యారు. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. శివకార్తికేయన్​కు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి ఫాలోయింగ్​ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ హీరో​ నటిస్తున్న అన్ని సినిమాల మాదిరి ఈ సినిమా కూడా తెలుగులోనూ రిలీజ్​ కానుంది.