Siva Balaji: పూన‌మ్ కౌర్ మాకు ఫిర్యాదు చేయ‌లేదు.. అవ‌న్నీ ఫేక్

siva balaji says poonam kaur never gave a complaint

Siva Balaji: ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌పై తీవ్ర స్థాయిలో ఆరోప‌ణలు చేసిన న‌టి పూన‌మ్ కౌర్ ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌సారి కూడా మా అసోసియేష‌న్‌కు ఫిర్యాదు చేసింది లేద‌ని అంటున్నారు న‌టుడు శివ బాలాజీ. ఈయ‌న మా అసోసియేష‌న్‌కు కోశాధికారిగా ప‌నిచేస్తున్నారు. ఇప్పుడ‌నే కాదు.. కొన్నేళ్ల క్రితం పూన‌మ్ గురూజీ అని సంబోధిస్తూ త్రివిక్ర‌మ్‌పై ఆరోప‌ణ‌లు చేసిన‌ప్పుడు కూడా త‌మ‌కు ఎలాంటి ఫిర్యాదు రాలేద‌ని తెలిపారు. త‌న‌కు తెలిసినంత వ‌ర‌కు చాలా మ‌టుకు కేసుల్లో 60 శాతం ఆడ‌వారు త‌ప్పుడ కేసులు పెడుతున్న‌వే అని అన్నారు. అన్నీ బాగున్న‌ప్పుడు అన్నీ చేసేసుకోని ఆ త‌ర్వాత ఏద‌న్నా గొడ‌వ వ‌స్తే రేప్ చేసాడు అంటూ కేసులు పెడుతున్నార‌ని తెలిపారు.

ఈ ఘ‌ట‌నపై ఆయ‌న భార్య మ‌ధుమిత కూడా స్పందించారు. “” నేను చిన్న వ‌య‌సులో ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను. నా 20 ఏళ్ల అనుభ‌వంతో చెప్తున్నాను. ఓసారి నేను ఓ సినిమాకు డ‌బ్బింగ్ చెప్తున్న‌ప్పుడు ఐ లవ్యూ అనే డైలాగ్ చెప్పాల్సి ఉంది. ఆ డైలాగ్ చెప్తున్న‌ప్పుడు అక్క‌డే ఉన్న డ‌బ్బింగ్ డైరెక్ట‌ర్ న‌న్ను పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్న‌ట్లు చెప్పాడు. నేను నో చెప్పాను. ఆడ‌దానికి మ‌గ‌వాడు స‌హ‌జంగానే ఆకర్షితుడ‌వుతాడు. కానీ వాళ్ల చూపులు చేష్ట‌ల‌కు మ‌న‌మెలా స్పందిస్తున్నామ‌న్న‌ది చాలా ముఖ్యం. మ‌గ‌పిల్ల‌ల్లో కూడా ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండే క‌దా అని వారితో బ‌య‌టికి వెళ్ల‌డం కూడా నా ఉద్దేశంలో క‌రెక్ట్ కాదు అని తెలిపారు.

ఎందుకంటే ఆడ‌దానికి ఎక్క‌డా సేఫ్టీ లేదు. ముఖ్యంగా మ‌న టాలీవుడ్‌లో ఉండేవారికి బ‌య‌ట చాలా ఫాలోయింగ్ పాపులారిటీ ఉంటుంది. కాబ‌ట్టి ఎవ‌రైనా ఏదైనా చేయాల‌నుకుంటే బాధితురాలు అరిచినా బ‌య‌ట చెప్పినా ఏంటి నా ప‌రిస్థితి అని భ‌య‌ప‌డ‌తారు. అదే బాధితురాలు మౌనంగా ముందు అన్నింటికీ ఒప్పేసుకుని ఆ త‌ర్వాత బ‌య‌టికి వచ్చి ఇలా చెప్తే ఎవ్వ‌రూ న‌మ్మ‌రు. ఒక‌వేళ ఇండ‌స్ట్రీలో నన్ను ఎవ‌రైనా లైంగికంగా వేధించి ఉంటే నేను వెంట‌నే బ‌య‌టికి వ‌చ్చేసేదాన్ని. అంతేకానీ నేను ముందు ఎద‌గాలి ఆ త‌ర్వాత వాళ్ల ప‌నిచెప్తాను అంటే కుద‌ర‌దు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇవే జ‌రుగుతున్నాయి. ముందు అన్నింటికీ ఒప్పేసుకుంటారు. ఆ త‌ర్వాత ఇలా జ‌రిగింది యాక్ష‌న్ తీసుకోలేదు అని సోష‌ల్ మీడియాలో పెడుతుంటారు. అందుకే నేను ఒక ఎన్జీవో పెట్టాల‌నుకున్నాను. కానీ ఎన్జీవో పెడితే నేను అనుకున్న మార్పు తేలేను. అందుకే రాజ‌కీయాల్లో చేరాల‌ని అనుకుంటున్నాను“” అని తెలిపారు.