Singam 4: సూర్య‌‌‌‌-అనుష్క కాంబో మరోసారి!

Chennai: కోలీవుడ్​ స్టార్​ హీరో సూర్య(Suriya) కెరీర్​లో మైల్​స్టోన్స్​గా నిలిచిన సినిమాలు సింగం(Singam) సిరీస్. సూర్య పవర్​ఫుల్​ పోలీస్​ ఆఫీసర్​గా మాస్​ యాక్షన్​తో వచ్చిన సింగం 1,2,3 సినిమాలు  తమిళ్​తో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యాయి. ఈ మూడు సినిమాలు ఒకదానికొకటి సీక్వెల్​గా వచ్చిన విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ హరి(hari) దర్శకత్వంలో రూపొందిన ఈ మూడు సినిమాలు భారీ విజయం సాధించాయి. ముఖ్యంగా వీటిలో ప్రత్యేకత ఏంటంటే ఈ మూడు సినిమాల్లో అనుష్కనే(Anushka Shetty) హీరోయిన్. సింగం 2లో హన్సిక(Hansika Motwani), సింగం 3లో శ్రుతీ హాసన్(Shruthi Haasan) రెండో హీరోయిన్​గా చేసినా అనుష్కని మెయిన్ ఫీమేల్​​ లీడ్​గా కంటిన్యూ చేస్తూ వచ్చారు.

ఇక చాలారోజుల నుంచి ఈ సిరీస్ కి మరో సీక్వెల్ సింగం 4 ప్లాన్ చేయమని అభిమానులు, ప్రేక్షకులు కోరుతున్నారు. గతంలో సింగం 4 ఉంటుందని వార్తలు వచ్చినా సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. తాజాగా మరోసారి కోలీవుడ్​లో సింగం 4 టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య డైరెక్టర్ శివ దర్శకత్వంలో కంగువ అనే భారీ బడ్జెట్ తో పీరియాడికల్ సినిమా చేస్తున్నాడు. కంగువ సినిమా షూట్ అయిన తర్వాత సూర్య సింగం 4 మొదలుపెడతాడని సమాచారం. తమిళ మాస్ డైరెక్టర్, సింగం సిరీస్ దర్శకుడు హరినే సింగం 4కు కూడా దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం హరి విశాల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తవగానే సింగం 4 ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతారని సమాచారం. అలాగే ఈ సినిమాలో కూడా అనుష్కనే  సూర్యకి జోడీగా నటించనుందట. అనుష్కతో పాటు మరో హీరోయిన్​ కూడా ఉంటుందట. ఆ రెండో హీరోయిన్​ ఎవరనేది ఇంకా ఫైనల్​ కాలేదు. మొత్తానికి సింగం 4 తో ప్రేక్షకులను మెప్పించడానికి మరోసారి సూర్య, అనుష్క జంటగా రాబోతున్నారన్నమాట.