Siddharth: వివాహబంధంతో ఒకటైన సిద్ధార్థ్, అదితి రావు హైదరి
Siddharth: ప్రముఖ నటుడు సిద్ధార్థ్.. బాలీవుడ్ నటి అదితి రావు హైదరి (Aditi Rao Hydari) చాలా కాలంగా డేటింగ్లో ఉన్నారు. ఈ ఏడాది వివాహం చేసుకుంటారని టాక్ కూడా వచ్చింది. కాగా.. ఈ రోజు వనపర్తిలోని శ్రీరంగపురం దేవాలయంలో వివాహం చేసుకున్నారు. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. త్వరలో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటుచేయనున్నారు. 2021లో వచ్చిన మహాసముద్రం సినిమాలో సిద్ధార్థ్, అదితి రావు హైదరి జంటగా నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత అదితి సిద్ధార్థ్ సహజీవనం చేస్తున్నట్లు టాక్ కూడా వచ్చింది.