Siddharth Aditi: ట్విస్ట్ ఇచ్చిన లవ్ బర్డ్స్…!
Siddharth Aditi: నటుడు సిద్ధార్థ్.. అదితి రావు హైదరి వనపర్తిలోని రంగనాథస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారని వార్తలు వెలువడ్డాయి. కానీ సిద్ధార్థ్, అదితి ట్విస్ట్ ఇచ్చారు. జరిగింది పెళ్లి కాదు నిశ్చితార్థం అని వెల్లడిస్తూ వేలికి ఉంగరాలను చూపిస్తున్న ఫోటోను పోస్ట్ చేసారు. 2021లో వచ్చిన మహాసముద్రం సినిమాలో సిద్ధార్థ్, అదితి రావు హైదరి జంటగా నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత అదితి సిద్ధార్థ్ సహజీవనం చేస్తున్నట్లు టాక్ కూడా వచ్చింది. ఇకపోతే.. అదితికి ఇది మొదటి వివాహమే అయినా సిద్ధార్థ్‌కి మాత్రం మూడో పెళ్లి. గతంలో ఆయన చేసుకున్న పెళ్లిళ్లు బ్రేక్ అయిపోయాయి. దాంతో చాలా కాలం పాటు సింగిల్‌గా ఉన్నారు. ఇప్పుడు అదితితో త్వరలో ఏడడుగులు వేయబోతున్నారు.
ALSO READ: Siddharth: పెళ్లి జరగలేదు.. సన్నిహితులు ఏం చెప్పారు?