Adipurush: మన దేవుళ్లు ఫ్యాషన్‌గా కనిపించాలట!
Hyderabad: ప్రభాస్ (prabhas) నటించిన ఆదిపురుష్ (adipurush) సినిమాపై ఏ రేంజ్‌లో ట్రోల్ జరుగుతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా బాగుంది అనేవారికంటే.. ట్రోల్ చేసేవారే ఎక్కువైపోయారు. ప్రభాస్ నమ్మి సినిమా చేసినందుకు హిందీ డైరెక్టర్ ఓం రౌత్ (om raut) బాగానే బుద్దిచెప్పాడు. అయితే ఆదిపురుష్‌లో (adipurush) నటించిన సిద్ధాంత్ కర్ణిక్ (siddhanth karnick) అనే హిందీ నటుడు సినిమాను సపోర్ట్ చేస్తూ చేసిన కామెంట్స్ అగ్గికి ఆజ్యం పోసినట్లైంది. సినిమాలో రావణాసురుడు, రాముడు, సీత, హనుమాన్ క్యారెక్టర్లు పాత కాలంలో చూపించినట్లుగా లేవని జనాలు తిడుతుంటే.. మన దేవుళ్లు అలా ఫ్యాషన్‌గానే కదా కనిపించాలని కామెంట్స్ చేసాడు.
ఈ సినిమాలో సిద్ధాంత్ విభీషణుడి పాత్రలో నటించాడు. మన దేవుళ్లు సూపర్‌హీరోల కంటే తక్కువేమీ కాదు అని చెప్పడానికే ఇలాంటి VFX వాడినట్లు చెప్తున్నాడు. అంతే కాదు పౌరాణిక సినిమాలను పాప్ కల్చర్ ఫార్మాట్లో చూపిస్తేనే ఇప్పటి జనరేషన్‌కి అర్థమవుతుంది అంటున్నాడు. అసలే ఆదిపురుష్ సినిమాపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధాంత్ ఇలా మాట్లాడి పుండు మీద కారం చల్లించుకుంటున్నారు.