Shruti Haasan: ఈక్వ‌ల్ రెమ్యున‌రేష‌న్‌​ కోసం వెయిటింగ్!

France: సెకండ్​ ఇన్నింగ్స్​లోనూ వరుస సినిమాలతో కుర్ర భామలకు గట్టి పోటీ ఇస్తోంది శ్రుతి హాసన్‌. వరుస సినిమాలతో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. ఈ ఏడాది ఆరంభంలోనే  సంక్రాంతికి వాల్తేరు వీరయ్య(Waltair Veerayya), వీరసింహారెడ్డి(Veera SimhaReddy) సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టింది. త్వరలోనే ప్రభాస్​(Prabhas) సలార్(Salaar) సినిమాతో రాబోతుంది. తాజాగా శ్రుతి హాసన్‌ ప్రతిష్టాత్మక 76వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్(Cannes Film Festival) లో పాల్గొంది. బ్లాక్ డ్రెస్ లో శ్రుతి హాసన్‌ రెడ్ కార్పెట్ పై మెరిసిపోయింది.

ఇక కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో శ్రుతి హాసన్‌ మాట్లాడుతూ హీరోయిన్స్ రెమ్యునరేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవలే సిటాడెల్​ ప్రమోషన్స్​లో భాగంగా ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ ‘హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకోవడానికి నేను రెండు దశాబ్దాలు కష్టపడాల్సి వచ్చింది’ అని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రియాంక వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ‘ప్రియాంక చోప్రా అద్భుతం సాధించారు. మేమంతా ఇంకా కష్టపడుతున్నాం. మన దగ్గర సమాన వేతనం గురించి కనీస చర్చలు కూడా లేవు. హీరోలతో పాటు హీరోయిన్స్ కి సమాన రెమ్యునరేషన్ లభించే రోజు వస్తుందని ఎదురు చూస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది శ్రుతీ హాసన్​. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్​గా మారాయి.