Shruti Haasan: మళ్లీ బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్
Shruti Haasan: నటి శృతి హాసన్ మరోసారి తన ప్రియుడితో విడిపోయారు. మ్యుజిషియన్ అయిన శాంతాను హజారికాతో (Shantanu Hazarika) దాదాపు నాలుగేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. ఎప్పుడూ తన ప్రియుడితో కలిసి ఏదో ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే శృతి.. కొన్ని రోజుల నుంచి ఎలాంటి ఫోటోలు పెట్టలేదు. పైగా ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో అయ్యారు.
అంతేకాదు.. శాంతానుతో కలిసి దిగిన ఫోటోలను కూడా శృతి డిలీట్ చేసేసారు. కోవిడ్ 19 సమయంలో వీరిద్దరూ డేటింగ్ మొదలుపెట్టారు. ఇద్దరూ కలిసి ముంబైలో ఓ అపార్ట్‌మెంట్ రెంట్‌కి తీసుకుని కలిసే ఉంటున్నారు. ఉన్నట్టుండి వీరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. శాంతానుతో పెళ్లికి శృతి తండ్రి కమల్ హాసన్ కూడా ఒప్పుకున్నారు. దాంతో త్వరలో శృతి పెళ్లి పీటలెక్కుతారు అనుకున్నారు. కానీ ఇలా అయిపోయిందని ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు.