Bhola Shankar: మెగాస్టార్‌ సినిమాలో శ్రియా స్పెషల్​ సాంగ్​!

Hyderabad: గాడ్​ ఫాదర్(God Father)​, వాల్తేర్​ వీరయ్య(Waltair Veerayya) సక్సెస్​తో ఫుల్ జోష్​లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న తాజా చిత్రం ‘భోళాశంకర్’(Bhola Shankar). ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు మెహర్ రమేశ్(Mehar Ramesh) డైరెక్ట్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో అభిమానులంతా సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరు సోదరిగా నటిస్తుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannah Bhatiya) ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, ఈ సినిమాలో తాజాగా మరో స్టార్ బ్యూటీ కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ బ్యూటీ శ్రియా సరన్(Shriya Saran) భోళా శంకర్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో చిందులేయనుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గతంలో ‘ఠాగూర్’ మూవీలో చిరుతో కలిసి రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ, పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది.

అయితే, ఇప్పుడు చిరు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ చేయమని శ్రియాను సంప్రదించగా ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో చిరుతో కలిసి శ్రియా వేసే స్టెప్పులకు థియేటర్లలో విజిల్స్ పడటం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. రామ్​ పోతినేని(Ram Pothineni) మొదటి సినిమా దేవదాసులో స్పెషల్​ సాంగ్​ చేసిన శ్రియా మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అలాంటి పాట చేయబోతోంది. మరి ఈ సినిమా శ్రియా ఎలాంటి స్టెప్పులతో కుర్రాళ్లను అలరిస్తుందో చూడాలిమరి!