నానికి జోడీగా శ్రద్ధా క‌పూర్‌?

shraddha kapoor opposite nani

Nani: ద‌స‌రా బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత శ్రీకాంత్ ఓదెల‌తో మ‌రో సినిమాలో నటిస్తున్నారు నాని. ఈ సినిమాకు నిర్మాణ కూడా సుధాక‌ర్ చెరుకూరే. తెలంగాణ గ‌డ్డ నేప‌థ్యంతోనే ఈ సినిమా కూడా ఉండ‌బోతోంద‌ట‌. అయితే.. ఇక్క‌డ చిన్న ఛేంజ్ ఏద‌న్నా చేస్తున్నారంటే అది హీరోయిన్. ఈసారి ద‌క్షిణాది హీరోయిన్ల‌ను కాకుండా బాలీవుడ్ వైపు చూస్తున్నారు. స్త్రీ 2 సినిమాతో బ్ర‌హ్మాండ‌మైన బ్లాక్‌బస్ట‌ర్‌ను సొంతం చేసుకున్న శ్ర‌ద్ధా క‌పూర్‌ను హీరోయిన్‌గా తీసుకోవాల‌ని అనుకుంటున్నారు. ఈ సినిమా మ్యూజిక్ కోసం అనిరుధ్ ర‌విచంద‌ర్‌ని అనుకుంటున్నారు. ఆల్రెడీ నాని గ్యాంగ్‌లీడ‌ర్ సినిమాకు అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లింది.

స‌రిపోదా శ‌నివారం సినిమాతో హిందీ మార్కెట్ నుంచి లాభాల‌ను ఎక్స్‌పెక్ట్ చేసారు. కానీ అది జ‌ర‌గ‌లేదు. దాంతో హాయ్ నాన్న‌కు హిందీ ఆడియ‌న్స్ బాగా క‌నెక్ట్ అయిన‌ట్లు ఈసారి శ్రీకాంత్ ఓదెల‌తో మ‌రో సినిమాను కనెక్ట్ చేయాల‌ని చూస్తున్నారు. హాయ్ నాన్న‌లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ అమ్మాయే. అందుకే అక్క‌డి ఆడియ‌న్స్ క‌నెక్ట్ అయ్యారు. అదే మాదిరిగా ఇప్పుడు శ్ర‌ద్ధా క‌పూర్‌ని తీసుకుంటే మ‌రో ప్యాన్ ఇండియ‌న్ సినిమా కొట్టిన‌వాళ్లం అవుతామని టీం అనుకుంటోంది. కానీ శ్ర‌ద్ధా ఇప్పుడు బిజీగా ఉంది. రెమ్యున‌రేష‌న్ కూడా భారీగానే డిమాండ్ చేస్తోంది. ఏం జ‌రుగుతుందో చూడాలి మ‌రి.