Shiva Nirvana: సినిమా చూసాక క‌పుల్స్ హ‌గ్స్ చేసుకుంటారు

ఖుషి (kushi) సినిమాపై చాలా కాన్ఫిడెన్ట్‌గా ఉన్నారు డైరెక్టర్ శివ నిర్వాణ‌ (shiva nirvana). విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (vijay devarakonda), స‌మంత (samantha) న‌టించిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 1న రిలీజ్ అవుతోంది. గ్రాండ్‌గా ప్ర‌మోషన్స్ కూడా స్టార్ట్ చేసారు. ఒంట్లో బాలేక‌పోయినా స‌మంత ప్రమోష‌న్స్‌లో పాల్గొన్నారు. అయితే ఖుషి సినిమా గురించి శివ నిర్వాణ చేసిన కామెంట్స్ చాలా వైర‌ల్ అవుతున్నాయి.

“” సినిమా చూసాక పెళ్లైన వారు, పెళ్లి చేసుకోబోయే క‌పుల్స్, పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోదాం అనుకునేవారు ఇంటికి వెళ్లి ఒక‌ర్నొక‌రు హ‌గ్ చేసుకుంటారు. ఈ సినిమా చూసి థియేట‌ర్ నుంచి బ‌య‌టికి వ‌చ్చాక త‌ప్పకుండా మ‌రోసారి చూడాల‌ని అనుకుని తీర‌తారు “” అని కాన్ఫిడెన్ట్‌గా చెప్పారు. (shiva nirvana)

ఇక సామ్ (samantha) మాట్లాడుతూ.. త్వ‌ర‌లో ఆరోగ్యంతో మంచి క‌మ్‌బ్యాక్‌తో మీ ముందుకు వ‌స్తాను అని ఫ్యాన్స్‌ని ఉద్దేశిస్తూ అన్నారు. ఈ సినిమాకు మైత్రి మూవీ మేక‌ర్స్ (mythri movie makers) తీస్తోంది. స‌మంత మైత్రి మూవి మేక‌ర్స్‌తో క‌లిసి న‌టించిన ప్ర‌తి సినిమా హిట్ అయింద‌ని ఇప్పుడు ఖుషి కూడా హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నామ‌ని ప్రొడ్యూస‌ర్స్ తెలిపారు.