Kushi: లిప్ కిస్ సీన్‌… డైరెక్ట‌ర్ వివ‌ర‌ణ‌

ఫైన‌ల్‌గా ఫ్లాప్స్ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (vijay devarakonda), స‌మంత‌ల‌కు (samantha) ఖుషితో (kushi) హిట్ వ‌చ్చేసింది. శివ నిర్వాణ (shiva nirvana) డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ఎక్క‌డ చూసినా పాజిటివ్ టాకే వ‌స్తోంది. స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ కూడా చేసేసారు. అయితే సినిమా స‌క్సెస్ అయిన సంద‌ర్భంగా ప్రెస్ మీట్‌లో శివ నిర్వాణ పాల్గొన్నారు. అయితే సినిమాలో స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల మ‌ధ్య రెండు లిప్ కిస్ సీన్లు ఎందుకు పెట్టాల్సి వ‌చ్చిందో వివ‌రించారు. అప్ప‌టివ‌ర‌కు ప్రేమించుకుని, పెళ్ల‌య్యాక గొడ‌వ‌లు వ‌చ్చి మ‌ళ్లీ క‌లిసిపోయిన‌ప్పుడు ఒక‌రిపై ఒక‌రికి ఉన్న ప్రేమ‌ను తెలియ‌జేయ‌క‌పోతే ఎలా.. బంధంలో ఆ ముచ్చ‌ట లేక‌పోతే ఎలా అంటూ చెప్పుకొచ్చారు శివ‌. (kushi)