Shilpa Shetty: మేం విడిపోయాం..!
Shilpa shetty raj kundra separated: ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి.. (shilpa shetty) రాజ్ కుంద్రా (raj kundra) దంపతులు విడిపోయారట. ఈ విషయాన్ని రాజ్ కుంద్రా ట్విటర్ ద్వారా వెల్లడించారు. మేం విడిపోయాం. దయచేసి ఈ సమయంలో మమ్మల్ని ఏమీ అడగకుండా కాస్త ప్రైవసీ ఇవ్వండి అని ట్వీట్ చేసారు.
అయితే శిల్పా శెట్టి మాత్రం అలాంటి ట్వీట్ కానీ పోస్ట్ కానీ పెట్టలేదు. అయితే వారు నిజంగా విడిపోలేదని తమ కొత్త సినిమా UTని ప్రమోట్ చేయడానికి ఇలాంటి ట్వీట్స్ పెడుతున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే శిల్పా శెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తన భర్తతో కలిసి దిగిన ఫోటోలన్నీ ఉన్నాయి. విడాకులు తీసుకుంటే హీరోయిన్ అయిన శిల్పా శెట్టినే ముందు వెల్లడించాలి. కానీ కేవలం ఆమె భర్త మాత్రమే ఇలా పోస్ట్ చేసాడంటే కచ్చితంగా ఇది ప్రమోషనల్ జిమ్మిక్కే అని క్లియర్‌గా తెలుస్తోంది. (shilpa shetty raj kundra divorce)
అయితే వీరు నిజంగా విడిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఇందుకు కారణం రాజ్ కుంద్రా పోర్న్ సినిమాలు తీస్తున్నాడన్న ఆరోపణలు ఉండటమే. అవి కోర్టులో ప్రూవ్ అయ్యాయి కూడా. ప్రస్తుతం రాజ్ కుంద్రా బెయిల్‌పై బయటికి వచ్చాడు. ఈ విషయం కారణంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారేమో అనే వాదనలు కూడా వస్తున్నాయి.