Madhavan: ఆమె కొడితే ఏడ్చి వెళ్లిపోయే టైప్ కాదు
Hyderabad: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్(kangana ranaut) గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు నటుడు మాధవన్(madhavan). కంగన(kangana), మాధవన్ కలిసి తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమాల్లో నటించారు. అయితే ఓ సందర్భంలో కంగన గురించి మాట్లాడుతూ.. “మనం ఎప్పుడూ చూసే హీరోయిన్ టైప్ కాదు తను. నా సినిమాల్లోని హీరోయిన్లను చూడండి. వారందరి రోల్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. నా ఇంట్లో కూడా నేను స్ట్రాంగ్ మహిళల మధ్య పెరిగాను. బిహార్‌లోని ఓ బ్యాంక్‌లో మా అమ్మ మేనేజర్‌గా 30 ఏళ్లు పనిచేసింది. ఈరోజుల్లో చూస్తే తాతయ్యలు వాళ్ల భార్యలపై ఆధారపడి ఉంటారు కానీ రివర్స్‌లో ఎక్కడా ఉండదు. ఇది మగవాళ్లంతా ఒప్పుకుని తీరాల్సిన సత్యం. అదే విధంగా నా సినిమాల విషయానికొస్తే నేను కంగనా రనౌత్, షాలిని వంటి స్ట్రాంగ్ మహిళలతో కలిసి పనిచేసాను. వాళ్లు సినిమాలో ఓ పాటకు వచ్చి వెళ్లిపోయే టైప్ కాదు. హీరో కొడితే ఏడ్చుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోయే టైప్ అసలు కాదు. హీరోయిన్లను అలా చూపించే సినిమాల్లో నేను అయితే నటించను. అలాంటి కథలు ఇప్పటికీ వస్తున్నాయంటే తీస్తున్నవారు ఫూల్స్ అనే చెప్పాలి. కంగనను చూడండి.. ఎంత స్ట్రాంగో. ఆమె ఎంచుకునే కథలు, నటన చూసి నేనే షాకవుతుంటా. చాలా గొప్ప నటి” అని తెలిపారు మాధవన్.