Sharwanand: మురారి, ఖుషి హిట్ అయిన‌ట్లే మ‌నమే హిట్ అవుతుంది

Sharwanand says manamey will be a hit just like kushi and murari

Sharwanand: శ‌ర్వానంద్ కృతి శెట్టి జంట‌గా న‌టించిన మ‌న‌మేపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు టాలీవుడ్‌లో రిలీజ్ అయిన ఏ సినిమా కూడా మంచి టాక్ అందుకోలేదు. దాంతో ఇక రాబోయే సినిమాల‌పైనే థియేట‌ర్లు ఆధార‌పడి ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఈరోజు మ‌న‌మే ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. ట్రైల‌ర్‌లో శ‌ర్వానంద్ కృతి శెట్టి ఒక‌రినొక‌రు తిట్టుకుంటూ ఉంటారు. దీనిపై శ‌ర్వానంద్ కాస్త కొత్త‌గా స్పందించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఖుషి సినిమాలో మ‌హేష్ బాబు న‌టించిన మురారి సినిమాలో కూడా హీరో హీరోయిన్లు ఒక‌రినొక‌రు తిట్టుకుంటార‌ని.. ఆ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మ‌న‌మే కూడా అంతే పెద్ద హిట్ అవుతుంద‌ని అన్నారు. ఇక త్వ‌ర‌లో జ‌ర‌గబోయే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రామ్ చ‌ర‌ణ్ గెస్ట్‌గా రాబోతున్నారు.