Sharwanand: ముందు రామ్ చ‌ర‌ణ్‌.. త‌ర్వాతే ప్ర‌భాస్

Sharwanand chose ram charan before prabhas

Sharwanand: రామ్ చ‌ర‌ణ్‌.. ప్ర‌భాస్‌ల‌లో ముందు ఎవ‌రు ఫోన్ చేసి పిలిస్తే వెళ్తావ్ అని శ‌ర్వానంద్‌ని అడ‌గ్గా..ఠ‌క్కున రామ్ చ‌ర‌ణ్ పేరు చెప్పాడు. కార్తికేయ గుమ్మ‌కొండ న‌టించిన భజేవాయువేగం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి శ‌ర్వానంద్ చీఫ్ గెస్ట్‌గా వెళ్లారు. ఆ స‌మ‌యంలో కార్తికేయ శ‌ర్వాను ఆట‌ప‌ట్టించాడు.  ఒకేసారి నీకు ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్ నుంచి ఫోన్ కాల్స్ వ‌స్తే ముందు ఎవ‌రి వ‌ద్ద‌కు వెళ్తావు అని శ‌ర్వానంద్‌ని అడిగాడు. ఇందుకు శ‌ర్వా స్పందిస్తూ.. ముందు చ‌ర‌ణ్ ద‌గ్గ‌రికి వెళ్లి ఆ త‌ర్వాత ప్రభాస్ వ‌ద్ద‌కు వెళ్తా అని చెప్పాడు. శ‌ర్వానంద్, రామ్ చ‌ర‌ణ్‌ల మ‌ధ్య మంచి స్నేహం ఉంది. శ‌ర్వా పెళ్లి వేడుక‌లో కూడా రామ్ చ‌ర‌ణ్ సందడి చేసారు.