Manamey Trailer: ఎంత ప్రేమ పెంచుకున్నా దగ్గరవుతాం కానీ సొంతమవ్వలేం
Manamey Trailer: శర్వానంద్ కృతి శెట్టి నటించిన మనమే ట్రైలర్ రిలీజ్ అయ్యింది. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇద్దరు విభిన్న వ్యక్తిత్వాలు కలిగిన వారు ఒకే చోట కలిస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో తీసారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే కృతికి ఆల్రెడీ ఓ బాబు ఉంటాడు. ఆ బాబు శర్వానంద్‌కు పుట్టినవాడు కాదు కాబట్టి అతనికి తండ్రి ప్రేమ అంటే తెలీకుండా చిన్న పరాయివాడిలా ప్రవర్తిస్తుంటాడు. ట్రైలర్ మధ్యలో ఎంత ప్రేమ పెంచుకున్నా దగ్గరవుతాం కానీ సొంతమవ్వలేం.. పిల్లల్ని పెంచడం అంటే యూట్యూబ్‌లో వీడియోలు చూసినంత ఈజీ కాదు అనే డైలాగులు హార్ట్ టచింగ్‌గా ఉన్నాయి. హేషమ్ అబ్దుల్ వాహబ్ ఇచ్చిన సంగీతం బాగుంది.